HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌ 'రంగ రంగ వైభవంగా' టైటిల్‌ టీజర్‌

వైష్ణవ్‌ తేజ్‌ ‘రంగ రంగ వైభవంగా’ టైటిల్‌ టీజర్‌

Ranga Ranga Vaibhavanga Tit

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ఆ తరువాత ‘కొండ పొలం’ సినిమాతోను మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన మూడో సినిమా ముస్తాబవుతోంది. ఈ సినిమాకి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

‘ఒక అమ్మాయి ట్రీట్ ఇవ్వాలనుకుంటే తనతో పాటు ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు తెలుసా?’ అంటూ బాయ్ ఫ్రెండ్ కి హీరోయిన్ బట్టర్ ఫ్లై కిస్ ఇవ్వడంపై టైటిల్ లాంచ్ టీజర్ ను కట్ చేశారు. లిప్ లాక్ తో టీజర్ ని స్టార్ట్ చేయడం వలన, ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెప్పచ్చు.

బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించనుంది. ‘రొమాంటిక్’ .. ‘లక్ష్య’ తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!