Ranbir Kapoor shoes cost:
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తన చిత్రాలతోనే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. గత ఏడాది యానిమల్ హిట్ తర్వాత రణబీర్ తెలుగు ప్రేక్షకులలో కూడా మరింత పాపులర్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన పబ్లిక్ ఎంట్రీలో మెరిసిపోతూ, అందరి దృష్టిని ఆకర్షించాడు.
రణబీర్ ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా విలాసవంతమైనదని చాలా మందికి తెలుసు. ఈసారి రణబీర్ తన ఫ్యాషన్ సెన్స్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. కానీ అందులో ఎక్కువగా ఆకట్టుకున్నది అతని షూస్. రణబీర్ డియర్ x ఎయిర్ జోర్డాన్ స్నీకర్స్ ధరించి కనిపించాడు, వీటి ధర అక్షరాలా రూ. 16.09 లక్షలు. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. హై-ఎండ్ ఫ్యాషన్‌ను కేజువల్ స్టైల్‌తో మిక్స్ చేయడంలో రణబీర్ మాస్టర్ అని ఈ లుక్ నిరూపించింది.
ఇక సినిమాల పరంగా కూడా రణబీర్‌కి ఈ ఏడాది చాలా పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న
రామాయణ లో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది. దాదాపు రూ. 835 కోట్ల వ్యయంతో ఈ చిత్రం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది.
రణబీర్ అభిమానులు ఈ మైథాలజికల్ ఎపిక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వెండి తెరపై ఈ ఎపిక్ కథ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆతృతగా ఉన్నారు. ఇంకా, రణబీర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ అండ్ వార్ లో కూడా నటించనున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని మార్చి 20, 2026కు వాయిదా వేసినట్లు సమాచారం.
Read More: Pawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?