
Ranbir Kapoor first wife:
బాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తన స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రణబీర్ గతంలో దీపికా పదుకోణె, కత్రినా కైఫ్ వంటి టాప్ హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరికి అతను అలియా భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం బేబీ గర్ల్ రాహాతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంతలో రణబీర్ కపూర్ చేసిన ఓ షాకింగ్ రివిలేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అలియా భట్ తన మొదటి భార్య కాదని చెప్పాడు. అసలు ఏమైంది అంటే..?
View this post on Instagram
“నా కెరీర్ ప్రారంభ రోజుల్లో ఓ అమ్మాయి ఓ పూజారి (ప్రీస్ట్) తో నా ఇంటి గేట్ వద్దకు వచ్చింది. నేను ఆమెను జీవితంలో ఎన్నడూ కలవలేదు, కానీ నా గేట్ దగ్గరే పెళ్లి చేసుకుంది. గేట్‌కి తిలకం పెట్టి, పుష్పాలు అర్పించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకుంది. ఇప్పటికీ నేను నా ‘మొదటి భార్యను’ కలవలేదు, కానీ ఏదో ఒక రోజు కలవాలని ఉంది” అని రణబీర్ నవ్వుతూ చెప్పాడు.
ఇది విన్న అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరు జోక్‌గా తీసుకున్నారు, మరికొందరు నిజంగా ఇలాంటి ఘటన జరిగిందా? అని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా, రణబీర్, అలియా ప్రస్తుతం సినిమాలు, ఎండార్స్‌మెంట్స్‌తో భారీగా సంపాదిస్తున్నారు. రణబీర్ కపూర్ ప్రస్తుతం తన ‘రామ్ ఆయాన’ మూవీపై ఫోకస్ పెట్టగా, అలియా భట్ కూడా తన కొత్త ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉంది.
ALSO READ: Rajamouli కూతురిని లంచ్ కి తీసుకువెళ్లిన బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?