బాలీవుడ్లో అలియా భట్, రణబీర్ కపూర్ అందమైన ప్రేమ జంట. వీరు ఎక్కడ కనిపించినా వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు నెటిజన్లు ఎంతోమంది ఇష్టపడతారు. అలాంటి వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ ఏడాది వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారట. వీరిద్దరి పెళ్ళికి ఇప్పటికే రెండు కుటుంబాలు ఏర్పాట్లు మొదలుపెట్టాయని చెబుతున్నారు. అయితే దీనిపై అలియా-రణబీర్ మౌనంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు పెళ్ళికి ముందే హనీమూన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హనీమూన్ కోసం ఈ జంట లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారట. స్విట్జర్లాండ్, బహమాస్, ఫిన్లాండ్ లోని మంచి లొకేషన్స్ ను సెర్చ్ చేశారట. విలాసవంతమైన ఎగ్జైటింగ్ రిసార్ట్ లొకేషన్లలో ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారట. హనీమూన్ సరే కానీ.. కనీసం ఆ తర్వాత అయినా పెళ్లి ఉంటుందా ఉండదా అన్నదానికి మాత్రం ఆ ఇద్దరి నుంచి సరైన క్లారిటీ లేనే లేదు. ఇక రణబీర్ తల్లిదండ్రులు రిషి, నీతూ కపూర్ లకు చెందిన ఐకానిక్ కృష్ణ రాజ్ భవంతి పునర్ నిర్మాణం జరుగుతోంది. ఈ భవనంలోనే రణబీర్-అలియా కాపురం పెట్టబోతున్నట్టు సమాచారం.