HomeTelugu Trendingతండ్రి కాబోతున్న రానా!

తండ్రి కాబోతున్న రానా!

Rana wife miheeka pregnancy

టాలీవుడ్‌ నటుడు రానా తండ్రి కాబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 2020 ఆగస్ట్ 8న రానా- మిహీకాలు బజాజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కరోనా సమయం కావడంతో వీరి వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఇప్పుడు రానా భార్య మిహీకా గర్భవతి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మిహీకా కాస్త బొద్దుగా తయారు కావడంతో.. ఆమె గర్భవతి అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తపై మిహీకా స్పందించింది. తాను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారాలేనని మిహీకా తెలిపింది. తాను ప్రెగ్నెంట్ కాదని ఆమె స్పష్టం చేశారు.

మీరు ప్రెగ్నెంటా? అని సోషల్ మీడియాలో మిహీకాను ఆమె ఫాలోయర్ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… తాను సంతోషకరమైన వైవాహిక బంధంలో ఉన్నానని… అందుకే ఈ మధ్య మరింత ఆరోగ్యవంతంగా తయారయ్యానని చెప్పారు. దీంతో, రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రచారానికి ముగింపు పలికినట్టయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu