రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘1945’. ఈ సినిమాకు శివకుమార్ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు శివకుమార్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘మూడేళ్ల తర్వాత నా సినిమా పూర్తయ్యింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. దేశభక్తి, ఒక ఐఎన్‌ఏ సైనికుడి ప్రేమ.. అనే భావోద్వేగాల మధ్య జరిగిన యుద్ధమే.. ‘1945” అని దర్శకుడు పేర్కొన్నారు.
ఐఎన్‌ఏ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్.ఎన్.రాజరాజన్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరాలను అందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని జనవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు రానా ‘విరాటపర్వం 1942’ సినిమాలో నటిస్తున్నారు. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.