దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసిన నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కింది. ఈ సిరీస్‌కు కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.
సాయం కావాలా? అని రానా డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సెలబ్రెటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. రానా దాన్ని సాల్వ్ చేసే వ్యక్తిగా టీజర్లో కనిపించాడు. కాగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక వెంకటేష్ జైల్లో నుండి రిలీజ్ అవుతున్నట్లు చూపించారు. వయసు మళ్ళిన పాత్రలో వెంకటేష్ లుక్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో వెంకటేష్‌పై రానా గన్ పెట్టే సీన్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.