HomeTelugu Trendingరానా పెళ్లి డేట్‌ ఫిక్స్.. మూడు రోజుల పెళ్లి.. వెల్లడించిన కుటుంబ సభ్యులు

రానా పెళ్లి డేట్‌ ఫిక్స్.. మూడు రోజుల పెళ్లి.. వెల్లడించిన కుటుంబ సభ్యులు

11 5
దగ్గుబాటి వారి ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. రానా దగ్గుబాటి పెళ్లి తేదీ ఖరారైంది. ఆగస్టు 8న తన ప్రేయసి మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఈ శుభకార్యాన్ని జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ఈ వేడుకని నిర్వహించాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. నిశ్చితార్థం నిర్వహించకుండా నేరుగా పెళ్లి చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu