టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం కరోనా కారణంగా కొద్ది మద్ది అతిథుల మధ్య సింపుల్‌గా జరగింది. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రానా, మిహికాల ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌లు లేకపోవడంతో రానా హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా మిహికా తన భర్తతో కలిసి జాలీగా గడుపుతున్న ఓ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
‘జస్ట్ బికాజ్ రానా’ అంటూ మిహికా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా బీచ్ లో ధరించే దుస్తుల్లో కనిపిస్తున్నారు ఈ కొత్త జంట. ఫ్యాన్స్ కామెంట్స్, లైకులతో ఈ ఫోటోని ట్రెండింగ్‌లోకి వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు రానా- మిహికా ప్రస్తుతం హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారని, ఆ సందర్భంలో దిగిన ఫోటోనే ఇది అంటూ కొందరు ఆ ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.