మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరస సినిమాలు చేస్తున్నాడు. కాగా ఆయన తాజా చిత్రం ఆచార్య సెట్స్‌పైనే ఉంది. లాక్డౌన్ తరువాత షూటింగ్ పూర్తి చేయాలని ఎదురు చుస్తున్నాడు కొరటాల. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లూసీఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు చిరంజీవి. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్ర చిరంజీవి చేస్తున్నాడు. అయితే మరో కీలక పాత్ర కూడా ఉంది. అదే పృథ్వీరాజ్ పాత్ర.. దానికోసం తెలుగులో చాలా మంది హీరోలను అనుకుంటున్నారు. అల్లు అర్జున్ పేరు కూడా వినిపించింది. అయితే ఆయన కాదని పిఆర్ టీమ్ తెలిపింది.
సల్మాన్ ఖాన్ పేరు కూడా వినిపించింది.. చిరంజీవి కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో హీరో రానా దగ్గుబాటి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో పృథ్వీ పాత్రకు రానా అయితే సరిపోతాడని చిరంజీవి కూడా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే సుజీత్ కథ చెప్పడం.. ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి.