HomeTelugu Trendingఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం​

ఓ వెబ్‌సైట్‌పై రానా అసహనం​

Rana fire on website over r

రానా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రానా తనపై వచ్చిన రుమర్స్‌పై ఘాటుగా స్పందిస్తుంటాడు. తాజాగా రానాకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఇటీవల తను నటించిన విరాట పర్వం మూవీ గురించి ఓ వెబ్‌సైట్‌ రాసిన కథనంపై రానా స్పందించాడు. అంతేగాక ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ సదరు వెబ్‌సైట్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

Rana fire 1

ఇంతకి విషయం ఏటంటే.. విరాట పర్వం మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్‌ బొబ్బిలి పలు కారణాల వల్ల తప్పుకున్నారంటూ రాసుకొచ్చింది. ఇక అది చూసిన రానా ట్విట్‌ చేస్తూ.. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అయితే రానా ట్వీట్‌ చేసిన అనంతరం కథనాన్ని సదరు వెబ్‌సైట్‌ డిలిట్‌ చేయడం గమనార్హం​. కాగా రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

Rana fire 2
వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. విరాట పర్వంలో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu