దగ్గుబాటి రానా ఆరోగ్యంపై కొన్ని రోజులుగా ఎవరికి నచ్చినట్లుగా వార్తలు రాస్తున్నారు.. సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఆయనే స్వయంగా ఈ వార్తలపై స్పందించాడు. కొన్ని రోజులుగా రానా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రానా కొన్నాళ్లుగా కనిపించకుండా పోయేసరికి ఇది నిజమే అనుకున్నారంతా. ఇందులో నిజం కూడా లేకపోలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై రానా కానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు.
రానా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడనేది ఈ వార్తల సారాంశం. చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా మందులతో నయం కాని పరిస్థితుల్లో ఇప్పుడు సర్జరీ కోసం ఫారెన్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఈయనకు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగిందని.. అది కూడా విజయవంతం అయిందని.. దాంతో దగ్గుబాటి కుటుంబం కూడా ఆనందంగా ఉన్నారని సోషల్ మీడియాలో న్యూస్ వస్తూనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు రానా స్వయంగా దీనిపై స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్లుండి దర్శనమిచ్చాడు రానా.
మీరెందుకు ఇంతగా బరువు తగ్గిపోయారని ప్రశ్నించగా.. ఎప్పుడూ రాక్షసుడిలా ఉండలేను కదా అంటూ అప్పట్లో సమాధానం ఇచ్చాడు. ఇక ఇప్పుడు కూడా రానా కొత్త ఫోటోలు చూస్తుంటే అయ్యో పాపం అనిపించక మానదు. అసలు ఒకప్పుడు రానా ఎలా ఉండేవాడు.. ఇప్పుడెలా ఉన్నాడు అనేది చూస్తుంటేనే షాక్ తప్పదు. బాహుబలిలో భళ్లాలుడు ఎలా ఉన్నాడో.. అందులో సగానికి సగం తగ్గిపోయాడు రానా. ఈయన కొత్త ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి రానా మునపటిలా ఎప్పుడు మారతాడో చూడాలి. ప్రస్తుతం విరాట పర్వం సినిమా చేస్తున్నాడు ఈయన.