HomeTelugu Big StoriesRana Daggubati: మళ్ళీ బాహుబలి కి పోటీగా భల్లాల దేవుడు

Rana Daggubati: మళ్ళీ బాహుబలి కి పోటీగా భల్లాల దేవుడు

Rana Daggubati finally in the game again
Rana Daggubati finally in the game again

Rana Daggubati Upcoming Movies:

బాహుబలి సినిమా తర్వాత రానా తన సినిమాల స్పీడ్ బాగా తగ్గించేశాడు. మళ్ళీ కొంచెం సినిమాలు చేస్తున్నారు అని అనుకుంటున్న సమయంలో మరొకసారి బ్రేక్ తీసుకున్నారు. విరాట పర్వం సినిమా తర్వాత, Rana Daggubati అసలు వేరే కొత్త సినిమాలను ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ రానా ను వెండి తెర మీద చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమాకి దూరంగా ఉన్నా వెబ్ సిరీస్ మాత్రం చేశారు. రానా నాయుడు అనే టైటిల్ తో ఓటిటి లోకి అడుగుపెట్టారు. కానీ రానా నాయుడు కూడా ఫ్యాన్స్ కి అంతగా ఎక్కలేదు. అయితే, రానా దగ్గుబాటి ఇప్పుడు ఫైనల్ గా ఒక కొత్త సినిమా ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశారని సమాచారం.

తాజాగా రానా ఒక కొత్త దర్శకుడు కిషోర్‌తో కలిసి హారర్ ఎలిమెంట్స్ ఉండే ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్కా మీడియా సంస్థ నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించనున్నారు. బాహుబలి సినిమా ద్వారా అర్కా మీడియా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది.

ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని, పాన్-ఇండియా విడుదలగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

మరోవైపు రానా ప్రస్తుతం సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు 2వ సీజన్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రానా మళ్ళీ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ.. చేతి నిండా సినిమాలు ఉన్న బాహుబలి ప్రభాస్ కి పోటీ గా రావాలి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu