Rana Daggubati production movies:
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా రూపొందించిన ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలిచింది. ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయ చిత్రం ఇది. దీనికి ముందు పామే డి’ఒర్ తర్వాత ఈ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.
తాజాగా ఇప్పుడు మన బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి ఈ సినిమా భారతీయ హక్కులను సొంతం చేసుకున్నారు. రానా తన బ్యానర్ స్పిరిట్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని థియేట్రికల్‌గా భారత్‌లో విడుదల చేయనున్నారు. కానీ సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా 2025 ఆస్కార్‌లో భారత అధికారిక ఎంట్రీగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రానాకు ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా మారనుంది. ఈ చిత్రం ఇద్దరు నర్సుల ప్రయాణం గురించిన కథతో తెరకెక్కింది. ఇందులో కాని కుస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫ్రాన్స్, నెదర్లాండ్స్ నుండి ఆర్థిక సహాయం కూడా అందింది.
ఈ చిత్రం ఫ్రాన్స్‌లో అక్టోబర్ 4న విడుదల కానుంది. మరి భారతదేశంలో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి. ఇదిలా ఉండగా, రానా నిర్మించిన 35 – ఒక చిన్న కథ కాదు అనే సినిమాని కూడా నిర్మించారు. ఇందులో విశ్వదేవ్, నివేత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా కలెక్షన్లు అందుకుంటోంది.
మరోవైపు, రానా దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాంత అనే ప్యాన్ ఇండియన్ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. హీరోగా మాత్రమే కాక రానా దగ్గుబాటి ఇప్పుడు నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారనే చెప్పాలి.