టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిర్మాత సురేష్ బాబు కుటుంబంతో కలిసి తిరుమల్లో సందడి చేశారు. నేటి ఉదయం సురేష్ బాబు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు రానా, అభిరామ్, రానా భార్య మీహిక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి ఆశీస్సులు తీసుకున్నారు. వీరి వివాహం అయి మూడేళ్లు పూర్తైంది. ఇటీవలే మీహిక ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే కుటుంబం మొత్తం శ్రీవారిని దర్శించుకోవడంతో..మళ్లీ ఆశలు చిగురించాయి. కాగా రేపు సురేష్ ప్రొడక్షన్లో నిర్మించిన ‘శాకినీ- డాకినీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా అభిరామ్ హీరోగా నటించిన ‘అహింస’ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించాలి అని మొక్కుకున్నట్లు తెలుస్తుంది.