HomeTelugu Trendingబాలకృష్ణ, రానా మల్టీస్టారర్ మూవీ?

బాలకృష్ణ, రానా మల్టీస్టారర్ మూవీ?

2 2
టాలీవుడ్‌ యంగ్ హీరో రానా.. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో రానా సినిమాలు విడుదల కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపద్యంలో ఫిలిమ్‌ నగర్ లో ఓ వార్త తెగ చెక్కర్లుకొడుతుంది. నందమూరి బాలకృష్ణ తో రానా మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. మలయాళంలో వచ్చిన ‘అయ్యప్పనుమ్‌ కోసియుమ్’ అనే సినిమా గత ఫిబ్రవరి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనీ టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రానా కలిసి నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాల్లో నటించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu