తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటికే 4 సీజన్లు పూర్తి చేసుకుంది. 5 సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి అని తెలుస్తోంది. అయితే ఈ ఇదిలా ఉంటే.. ఈ షోకి సంబంధించి ఓ ఆసక్తికర సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడంలేదట. ఆయన స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో దుగ్గుబాటి రానా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున.. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఐదో సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. నాగ్ తప్పుకోవడంలో బిగ్‌బాస్ నిర్వాహకులు పలువురు యంగ్ హీరోలను సంప్రదించారట. ఈ క్రమంలో రానా దగ్గుబాటిని ఫైనల్ చేశారట. రానా గతంలో ‘నెంబర్ వన్ యారీ’ అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవంలోనే బిగ్‌బాస్-5 సీజన్‌కి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.