హీరో రానా త్వరలో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు తేజ డైరెక్టర్. రానా, తేజ కాంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ భారీ విజయం సాధించింది. తేజ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘అహింస’ డిజాస్టర్‌గా నిలిచింది. దాని ఫలితంగా రానాతో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి.
ప్రస్తుతం రానా, తేజ కాంబోలో వస్తున్న మరో సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాక్షస రాజు పేరు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరో రానా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ సినిమాకు సంబంధించి నిర్మాత, నటీనటులు, టెక్నికల్ టీమ్ గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఒక సినిమా రెండు భాగాలుగా రావడం అనేది ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. కానీ అలా వచ్చిన సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. రానా తాజా సినిమా రెండు భాగాలుగా వచ్చినా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.