‘బాహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ తన నటనతో కట్టిపడేసారు. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్2’ సినిమాలో కూడా రమ్యకృష్ణను ఎంపిక చేసారంట. కానీ ఆతర్వాత ఆమెను కాదని బాలీవుడ్ నటికి ఛాన్స్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
కేజీఎఫ్2లో కీలక పాత్ర కోసం ముందుగా రమ్యకృష్ణను సంప్రదించారట చిత్ర నిర్మాతలు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రమ్యకృష్ణ కూడా భారీగా డిమాండ్ చేసారని తెలుస్తుంది. రమ్యకృష్ణ డిమాండ్ చూసి నిర్మాతల నోట మాట రాలేదంట దాంతో ఆమె ప్లేస్ లో బాలీవుడ్ నటి రవీనా టాండన్ ను తీసుకున్నారని సమాచారం. పార్ట్ 2 లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. హీరో యష్, సంజయ్ మధ్య ఫైట్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావు రమేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ మొదటి పార్ట్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇక పార్ట్ 2 పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.