యంగ్ టైగర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోజక్ట్ కు ‘అయినాను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్‌తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు)- నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే త్రివిక్రమ్ ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం శివగామి రమ్యకృష్ణ ను ఎంపిక చేసారని తెలుస్తుంది. బాహుబలి, సోగ్గాడే చిన్నినాయనా, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలాగే ” నా అల్లుడు ” సినిమాలో ఎన్టీఆర్ అత్తగా రమ్యకృష్ణ నటించారు.