తెలుగు బిగ్‌బాస్-3 మంచి రేటింగ్‌తో కొనసాగుతున్న రియాల్టీ షో. మూడో సీజన్‌కు హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున ప్రస్తుతం తన పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా నాగార్జున స్థానంలో రెండురోజుల పాటు బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా రమ్యకృష్ణ వ్యవహరించారు. శివగామి అలియాస్ రమ్యకృష్ణ హౌస్‌లోకి నేను చెప్పిందే శాసనం అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హోస్ట్‌గా ఎలా చేస్తారోనని ప్రేక్షకులు కాస్త అనుమానించినా పర్వాలేదనిపించారు. కొన్ని సందర్బాల్లో నాగార్జున కంటే రమ్య బాగా
చేసిందని కూడా కొందరు అంటున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి జరిగిన అన్యాయాలేమిటో తెలుసుకుని తన స్టైల్లో వ్యవహరించి పరిష్కరించింది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ హౌస్‌లో లేడీ కంటెస్టెంట్ల పట్ల మేల్ కంటెస్టెంట్స్ తీరును ఎండగట్టింది. ఎక్కువగా అందరూ వితికను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ రమ్యకృష్ణ మిగతా కంటెస్టెంట్స్‌ను ప్రశ్నించింది. నా కోసం స్పెషల్‌గా స్పైసీగా ఓ డిష్ కావాలంటూ బాబా మాస్టర్‌కు ఆర్డర్ వేసింది. ఓ పక్క తప్పులను చూపిస్తూ సరదాగా సెటైర్లు వేసింది. మొత్తానికి శివగామి అలియాస్ రమ్యకృష్ణ బిగ్‌బాస్3 షోను తన మాటలతో హీట్ పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత.. మళ్లీ బిగ్‌బాస్ షోలో జోష్ వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. మళ్లీ ఆమెనే యాంకరింగ్ చేస్తే బాగుండు అని నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈవారం బిగ్‌బాస్ షోలో నాగార్జున లేకపోవడంతో ఎలిమినేషన్ లేదని ప్రకటించారు.