సినియర్ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా రమ్యకృష్ణ కారును పోలీసులు తనిఖీ చేశారు. అప్పుడు రమ్యకృష్ణ కారులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం లభించింది. శివగామి ఈ కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో చెన్నైలోనే ఉంటుంది. అయితే చెన్నైలో మద్యం లభించపోవడంతో మహాబలిపురం నుండి మద్యం తిసుకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే రమ్యకృష్ణను వెంటనే బెయిల్ పై విడుదల చేసినట్లు సమాచారం. అయితే తన కారు డ్రైవర్ సెల్వకుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇంత మద్యం రమ్యకృష్ణ కారులో ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది మాత్రం తెలియదు. అయితే ఈ ఘటనపై ఇంకా రమ్యకృష్ణ స్పందించలేదు.