తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘క్వీన్’ టీజర్ వచ్చేసింది. గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలితగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘క్వీన్’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ‘క్వీన్’ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ‘స్కూల్ డేస్‌లో స్టేట్ టాపర్, 18 ఏళ్ల వయసుకే స్టార్ హీరోయిన్, పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రి, మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే ‘క్వీన్’ మీకోసం ఎదురుచూస్తుంది అని ‘క్వీన్’ బృందం పేర్కొంది. ఈ నెల 5వ తేదీన ట్రైలర్ విడుదల కానుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్స్లు కొన్ని ప్రకటనలకే పరిమితం కాగా, మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని వస్తున్న రెండు చిత్రాలు మాత్రం విడుదలకు ముందే ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. అందులో ఒకటి గౌతమ్ మీనన్ తెరకెక్కించే ‘క్వీన్’ కాగా. మరొకటి విజయ్ తెరకెక్కిస్తున్న ‘తలైవి’. ఇందులో కంగనా రనౌత్ జయలలితగా
కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.