మెగా పవర్ రస రామ్‌చరణ్ ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తలెత్తిన వివాదంపై సినీ పెద్దలు దృష్టి సారించారని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు కృషి చేస్తున్నారని చెప్పాడు. హ్యాపీ మొబైల్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న చరణ్.. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్ సంస్థ షోరూంను ఇవాళ ప్రారంభించాడు. ఈ సందర్భంగా మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఫోన్లను ఆవిష్కరించి సందడి చేశాడు. అనంతరం చరణ్ మాట్లాడుతూ… విజయవాడకు వచ్చే అవకాశం ఎప్పుడొచ్చినా వదులుకోనన్నాడు.
కొత్త ఏడాదిలో అందరికీ సంతోషం నిండాలని కోరుకుంటున్నట్లు చరణ్ చెప్పాడు. బాలీవుడ్ ఎంట్రీ గురించి విలేకరి అడగ్గా ఇప్పట్లో అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చాడు. అనంతరం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గురించి ముచ్చటించాడు. ఇప్పటికే సినిమా 75 శాతం షూటింగ్ పూర్తయిందని, సినిమా చాలా బాగుంటుందన్న నమ్మకం ఉందని చెప్పాడు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నాడు. చరణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు షోరూం దగ్గరికి తరలివచ్చారు. రామ్‌చరణ్ అభిమానులకు అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం సెల్ఫీలు దిగారు.