టాలెంటెడ్ ఇండియన్ డాన్స్ కొరియోగ్రాఫర్ లలో గణేష్ ఆచార్య. బాలీవుడ్‌లో ఎక్కువ శాతం సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే అడపాదడపా గణేష్ ఆచార్య కూడా టాలీవుడ్ సినిమాలకి వర్క్ చేస్తున్నాడు. అతని డాన్స్ కి సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ 15వ చిత్రంలో ఓ సాంగ్ కొరియోగ్రాఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ ఈమూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక శంకర్ ఈ మూవీ సాంగ్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్నారు. ఆయన ప్రతి సినిమాలో కచ్చితంగా గణేష్ ఆచార్యతో ఒక్క సాంగ్ అయిన చేయిస్తూ ఉంటారు. అలాగే ఈ మూవీ కోసం ఒక ప్రత్యేక గీతాన్ని చేయించినట్లు తెలుస్తుంది.
ఈ సాంగ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూరైంది అని తెలుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆర్ సీ 15 సెట్ లో గణేష్ ఆచార్యతో కలిసి రామ్ చరణ్ డాన్స్ స్టెప్పులు వేసిన షార్ట్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇప్పటికే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో RC15పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది.
How lovely is this!🤩@AlwaysRamCharan shakes a leg with Ace Choreographer Ganesh Acharya for Blockbuster Gaana #MainKhiladiTuAnari 💥#RamCharan𓃵 #RamCharan #JrNTR #ManOfMassesRamCharan #RC15 #GaneshAcharya pic.twitter.com/df4ZHcnjWo
— KLAPBOARD (@klapboardpost) February 13, 2023