టాలీవుడ్‌లో కమర్షియల్ బ్రాండ్స్ ప్రమోషన్స్ చేస్తున్నవారిలో మహేష్ బాబు టాప్. తరువాత స్థానాల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ ఉన్నారు. వీరినే ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం కంపెనీలు ఎంచుకుంటున్నాయి. రామ్ చరణ్ ఇప్పటికే మొబైల్ షోరూమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా లెవల్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అందుకే కంపెనీలు కూడా వీరిని తమ ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉపయోగించుకుంటాయి. తమ ప్రొడక్ట్ ప్రచారం కోసం కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ కూడా చెల్లిస్తున్నారు.
రామ్‌చరణ్ తాజాగా కొత్త బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ యాప్ మీషోకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. మీషో యాప్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ యాడ్ రిలీజ్ చేశారు. ఆ యాడ్ సినిమాటిక్ స్టైల్‌లో ఉండటం విశేషం. ఈ యాడ్‌లో రామ్ చరణ్‌ను ఏజెంట్‌లా చూపించారు.
https://www.instagram.com/reel/CuRiP00g_wI/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==