HomeTelugu Trendingరామ్‌చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం

రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం

Ramcharan upsana on forbesహీరో రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంటకు స్థానం దక్కింది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంటకు ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించే ఛాన్స్ దక్కలేదు. మొదటిసారి రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

ఫోర్బ్స్ మ్యాగజైన్‌పై ప్రచురించడమే కాకుండా సూపర్ కపుల్ అంటూ కవర్ పేజీపై క్యాప్ష‌న్ ఇచ్చారు. రామ్‌ చరణ్ దంపతులకు అరుదైన గౌరవం దక్కడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

రామ్‌చరణ్ దంపతులతో ఫోర్బ్స్ మ్యాగజైన్ జరిపిన ఇంట‌ర్వ్యూలో భాగంగా ఫొటో షూట్ జ‌రిగింది. ఈ ఫొటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెసుల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్. ఉపాసనల‌ ల‌వ్ స్టోరీ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు. క్లీంకార వారి జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వ‌చ్చాయి అనేది రామ్‌చరణ్ దంపతులు ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu