HomeTelugu Trendingఒకే ఫ్రేమ్‌లో మహేష్‌- రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ

ఒకే ఫ్రేమ్‌లో మహేష్‌- రామ్‌ చరణ్‌ ఫ్యామిలీ

ramcharan and mahesh family
దీపావళి సందర్భంగా.. సెలబ్రిటీలైతే ఇప్పటికే ప్రత్యేక విందు పార్టీలతో సందడి చేస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా నిర్వహించిన ఓ పార్టీలో టాలీవుడ్‌ స్టార్స్‌ రామ్‌చరణ్‌, మహేశ్‌ బాబు తన కుటుంబంతో కలిసి సందడి చేశారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకొని మేఘా ఇంజినీరింగ్‌ కళాశాల అధినేత మేఘా కృష్ణారెడ్డి, మేఘా సుధారెడ్డి ప్రత్యేక విందు పార్టీ నిర్వహించారు.

ఈ పార్టీకి పలువురు స్టార్స్‌ హాజరై సందడి చేశారు. టాలీవుడ్‌ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ – ఉపాసనతో కలిసి ఈ పార్టీలో మెరిశారు. అదేవిధంగా మరోస్టార్‌ జంట మహేశ్‌ బాబు -నమ్రత కూడా హాజరయ్యారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.

పార్టీకి సంబంధించిన ఫొటోలను నమ్రత సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్టార్స్‌ జంట ఒకే ఫ్రేమ్‌లో కనిపిండచంతో మెగా, ఘట్టమనేని అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక ఇదే పార్టీకి టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేశ్‌, మంచు విష్ణు భార్య విరానిక కూడా పాల్గోన్నారు.

https://www.instagram.com/p/CzRa1f1Pr15/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu