నటి రంభ ఒకప్పుడు హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత రంభ భర్త మరియు ఫ్యామిలీతో కలిసి మలేషియాలో సెటిల్ అయింది. ఆ మధ్య ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన రంభ పూర్తి స్థాయి లో రీ ఎంట్రీ ఇవ్వలేదు.
తాజాగా రంభ ఒక ప్రముఖ హీరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రంభ ఇక నుంచి కంటిన్యూస్ గా తెలుగు మరియు తమిళ సినిమా ల్లో నటించేందుకు రెడీగా ఉందట. ఆ విషయాన్ని సన్నిహిత దర్శక నిర్మాతలకు ఆమె మెసేజ్ ద్వారా తెలియజేసిందని టాక్ వినిపిస్తోంది.
రంభ రీ ఎంట్రీకి సిద్ధం అయితే ఆమె యంగ్ హీరోలకు అక్క లేదా అత్త పాత్రల్లో రంభ సెట్ అవుతుందని కొందరు అంటున్నారు. అయితే రంభ ను అలా చూడలేమని అభిమానులు కొందరు మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు తో పాటు తమిళ్ మరియు కన్నడ భాషల్లో సినిమాలు చేసింది.
ఇప్పుడు కూడా ఒక్క భాష అని.. పలానా పాత్రలు మాత్రమే చేయాలనే ఉద్దేశ్యంతో రంభ లేదని తెలుస్తోంది. అందుకే రంభ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు. రీ ఎంట్రీ తో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంటే రంభ సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.