టాలీవుడ్ హీరో రామ్ పోతినేని పెళ్లి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఓ వ్యాపారవేత్త కుమార్తెను రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి ఈ ఏడాదే జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట. వచ్చే ఆగస్టులో నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వీళ్లిద్దరి వివాహం కూడా జరిపించాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. దీనిపై అధికారంగా ఎలాంటి ప్రకటన, ధ్రువీకరణ ఇంత వరకు రాలేదు.
టాలీవుడ్‌లో మిగిలిన కొద్ది మంచి బ్రహ్మచారుల్లో రామ్ కూడా ఒకరు కావడంతో, అతని పెళ్లిపై ఆసక్తి నెలకొంది. అతని వివాహంపై గతంలోనూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. మరోసారి అతడి వివాహం అంశం తెరపైకి రావడంతో ఆసక్తి ఏర్పడింది. దీంతో రామ్ పెళ్లి కబురు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
కాగా రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ర్యాపో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే మైసూరులో శ్రీలీల, రామ్ మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ఫొటోలను శ్రీలీల తన ఇన్ స్టా పేజ్‌లో షేర్ చేసింది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు..
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు