HomeTelugu Trendingఆ హీరోయిన్‌తో ప్రేమలో రామ్‌!

ఆ హీరోయిన్‌తో ప్రేమలో రామ్‌!

ram pothineni 1
ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌లు ప్రేమ వివాహాలు చేసుకోవడం మామూలే. త్వరలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని వంతు వచ్చింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, రామ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిలింనగర్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ram pothineni love with anu

కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు. రామ్, అనుపమలు ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రాలలో కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది అని టాక్‌. ఈ వార్తలపై రామ్ స్పందిస్తారేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu