HomeTelugu Trendingరామ్‌పోతినేని తాత కన్నుమూత

రామ్‌పోతినేని తాత కన్నుమూత

Ram Pothineni grandfather p

టాలీవుడ్‌ యువ నటుడు రామ్‌పోతినేని తాతయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ భావోద్వేగ ట్వీట్‌ పెట్టాడు. కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని రామ్‌ అన్నాడు. ‘‘తాతయ్య.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ అని రామ్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu