ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఫుల్ హ్యాండ్స్ టైట్ ఫిట్ టీషర్ట్.. బాటమ్ లో ఫార్మల్ థిక్ కలర్ ఫ్యాంటుతో అతడి లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. చెరిగిన క్రాఫ్ స్మైలీ ఫేస్ తో .. లైట్ గడ్డంతో ఎంతో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు రామ్. 32ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి టీనేజర్ లా మరిపోయాడా? అంటూ షాక్ కు గురవుతున్నారు ఫ్యాన్స్. “9 నుండి 5 వరకు: మీరు ఎలా రాక్ అవుతున్నారో వారికి చూపించండి. 5 నుండి 9 వరకు: మీరు ఎలా రోల్ చేస్తారో వారికి చూపించండి” అన్న వన్ లైనర్ థీమ్ ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఈ ఫోటో జెట్ స్పీడ్ తో వైరల్ అవుతోంది.
9 to 5: Show em how you Rock..
5 to 9: Show em how you Roll!!Love..#RAPO pic.twitter.com/9ZrYB8Utkg
— RAm POthineni (@ramsayz) November 6, 2020