‘కందిరీగ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి ఆ తరువాత ‘రభస’ అనే చిత్రాన్ని రూపొందించారు
సంతోష్ శ్రీనివాస్. ప్రస్తుతం రామ్ హీరోగా ‘హైపర్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా సెప్టెంబర్
30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ విలేకర్లతో
ముచ్చటించారు.
తండ్రి లక్ష్యాన్ని గెలిపించే కొడుకు..
ప్రతి కొడుకికి తన తండ్రి మీద ప్రేమ ఉంటుంది. కానీ అన్ని వేళలా.. ఆ ప్రేమను ఎక్స్ ప్రెస్
చేయడు. తండ్రికి కష్టం వస్తే గనుక ముందుగా కొడుకే రియాక్ట్ అవుతాడు. మా సినిమాలో
కూడా తండ్రి లక్ష్యాన్ని గెలిపించే కొడుకు కథ. సినిమాలో హీరో క్యారెక్టర్ హైపర్ గా ఉంటుంది.
అందుకే సినిమాకు అదే టైటిల్ గా పెట్టాం. ప్రతి ఇంట్లో ఇలాంటి హైపర్ ఉన్నవాడు ఒకడు
ఉంటాడు.
సొసైటీకు ఉపయోగపడే పాయింట్..
ఇది కమర్షియల్ సినిమా అయినప్పటికీ సొసైటీ లో బర్న్ అవుతున్న ఒక ఇష్యూ గురించి
మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఆ పాయింట్ సినిమాకు కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు
ఆ పాయింట్ ను ఎవరు టచ్ చేయలేదు. ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా సినిమా ఉంటుంది.
నా దృష్టిలో రామ్ కమర్షియల్ హీరో..
నేను.. శైలజ సినిమా తరువాత రామ్ ను అలాంటి పాత్రల్లోనే చూపించాలని అనుకుంటున్నారు.
నా దృష్టిలో రామ్ ఎప్పటికీ కమర్షియల్ హీరోనే.. అయితే తను ‘నేను.. శైలజ’ వంటి ఫ్యామిలీ
సినిమాలు చేయగలడు.. అలానే హైపర్ లాంటి ఎనర్జిటిక్ సినిమాలు కూడా చేయగలడు.
దర్శకులపై ఆ ప్రభావం ఉంటుంది..
దర్శకుడిపై హిట్స్, ఫ్లాప్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కందిరీగ హిట్ తో నాకు రభస ఆఫర్ వచ్చింది.
ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న నా స్నేహితులు మాత్రం నన్ను దూరం
పెట్టలేదు. అల్లు అర్జున్, రవితేజ, రామ్, సాయి ధరం తేజ్ ఇలా అందరూ నాతో సినిమా
చేస్తా అన్నారు. నా దగ్గర వారికి తగ్గ కథలు ఉంటే వినిపిస్తాను.
ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టం..
నా దృష్టిలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు మించినది ఏది లేదు. అలాంటి ఎమోషన్స్ ను స్క్రీన్ మీద
ప్రెజంట్ చేస్తే జెన్యూన్ గా ఉంటుంది. అందుకే నా కథల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటాను.
పెర్ఫార్మన్స్ లో డెప్త్ పెరిగింది..
కందిరీగ సినిమాలో రామ్ యంగ్ స్టర్ గా.. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తపించే అబ్బాయిగా
కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో బాధ్యత గల కొడుకిగా కనిపిస్తాడు. అప్పటికి ఇప్పటికీ రామ్
లో మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగాయి. పెర్ఫార్మన్స్ లో డెప్త్ పెరిగింది.
తదుపరి చిత్రాలు..
ఇంకా ఏది ఫైనల్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే సినిమానే తీస్తాను.