HomeTelugu Newsఅయోధ్యలో బంగారంతో రామ మందిరం!

అయోధ్యలో బంగారంతో రామ మందిరం!

8 15
బాబ్రీ.. రామ జన్మభూమికి సంబంధించిన కేసు చాలా కాలంగా కోర్టులో నడుస్తోంది. ఈ కేసు పరిష్కారం కోసం చాలామంది మధ్యవర్తిత్వం చేసినా కుదరలేదు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డెడ్‌లైన్ విధించారు. కేసుకు సంబంధించిన వాదనలన్నీ అక్టోబర్ 18 లోగా పూర్తి చేయాలని ఇప్పటికే జారీ చేశారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా తుది తీర్పు వెల్లడించనున్నట్టు సుప్రీంకోర్టు తేల్చింది. దీనికోసమే ప్రత్యేకంగా బెంచ్ ను ఏర్పాటు చేసి ప్రతిరోజూ వాదనలను వింటోంది. అవసరమైతే మరో గంట అదనపు సమయాన్ని కూడా కేటాయిస్తామని ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికల్లా కేసును ముగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

అయోధ్యలో రామాలయానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని హిందూమహాసభ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా వస్తే అయోధ్యలో మందిరాన్ని బంగారంతో నిర్మిస్తామని అంటున్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు. అయోధ్యలో రామ మందిరానికి వారంతా తప్పకుండా విరాళాలు ఇస్తారని, అయోధ్యలో బంగారు రామాలయాన్ని నిర్మిస్తామని హిందూమహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu