లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ.. ఈ టైమ్‌ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పనికి ఉపయోగించుకున్నాడు. టెక్నాలజీని వినియోగించుకొని వర్మ ఏకంగా ‘కరోనా వైరస్’ అనే సినిమాను తీశాడు. ఒక ఇంట్లో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఓ సినిమాను తీశాడు. ఇది వర్మ చేసిన ప్రయోగం అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ వరల్డ్ మూవీస్ లో ఈ సినిమా విడుదల అవుతుంది.
దీనికి సంబంధించిన ట్రైలర్ ను వర్మ ఈరోజు రిలీజ్ చేశాడు. లాక్‌డౌన్ సమయంలో కరోనా ఇంట్లోకి ప్రవేశిస్తే దాని వలన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్నది సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.