HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండపై ఆర్జీవీ ప్రశంసలు

విజయ్‌ దేవరకొండపై ఆర్జీవీ ప్రశంసలు

Ram gopal varma tweet about

డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ వివాదాలు, విమర్శలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న ఈయన ఇప్పుడు ఏం సినిమాలు తీస్తున్నాడో, ఎందుకు తీస్తున్నాడో కూడా తెలియని స్థితి దాపురించింది. ఇదిలా వుంటే తాజాగా ఆర్జీవీ ఓ తెలుగు హీరోను ఆకాశానికెత్తాడు. స్క్రీన్‌ మీద అతడి లుక్‌ స్టార్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోదని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశాడు. విజయ్‌ దేవరకొండ పై ఓ రేంజ్‌లో ప్రశంసలు చేశాడు.

“లైగర్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ గత రెండు దశాబ్దాల్లో వచ్చిన స్టార్‌ హీరోల కంటే అద్భుతంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌లకు ధన్యవాదాలు” అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. లైగర్‌లోని కొన్ని సన్నివేశాలు చూసిన కాసేపటికే ఆయన ఈ కామెంట్లు చేయడంతో రౌడీ ఫ్యాన్స్‌ తెగ ఎగ్జైట్‌ అవుతున్నారు. లైగర్‌లో మరో కొత్త విజయ్‌ను చూడబోతున్నామా? అని ఆతృతగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కొందరు మాత్రం కావాలని విజయ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu