HomeTelugu Big Storiesవర్మ 'ఖైదీ'ని పొగిడాడు!

వర్మ ‘ఖైదీ’ని పొగిడాడు!

చిరంజీవి 150వ సినిమా మొదలుపెట్టినప్పటినుండి రామ్ గోపాల్ వర్మ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ ప్లేట్ మార్చి ఇప్పుడు ఖైదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వర్మ తన అభిప్రాయాన్ని మార్చుకోవడం పట్ల మరో కారణం ఏమైనా.. ఉందా అని చర్చించుకుంటున్నారు.

”ఇప్పుడే ఖైదీ నెంబర్ 150 చూశాను.. మెగా మెగా మెగా ఫెంటాస్టిక్ కంటే మెగాస్టార్ చాలా అద్బుతంగా ఉన్నారు. 150 మిలియన్ చీర్స్ చెబుతున్నాను. ఎనర్జీ లెవెల్స్ లో మెగాస్టార్ సుప్రీం. 9 ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. మెగా హ్యాండ్సమ్ గా ఆయన కనిపిస్తున్నారు” అంటూ వర్మ తెగ పొగిడేశాడు. రీసెంట్ గా నాగబాబు, వర్మపై ఫైర్ అయినప్పుడు తన ట్విట్టర్ ద్వారా నాగబాబుకి సమాధానం చెప్పిన వర్మ వెంటనే నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారంటూ.. ఓ పోస్ట్ పెట్టేశాడు. మరి ఇప్పుడు ఇలా చిరంజీవిని పొగిడాడు అంటే మళ్ళీ కాసేపట్లో నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారంటూ మరో ట్వీట్ ఏమైనా.. పెదతాడేమో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu