ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై సోషల్ మీడియా ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో స్పందించారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచరస్ మూవీ ‘ఇండియానా జోన్స్’ గుర్తుందా.. ఈ మూవీ టైటిల్‌లో ఇండియా ఉండడం వలన ఇక నుంచి ఈ మూవీని భారత్‌నా జోన్స్ అని పిలవాలని రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
కొందరు వర్మ కామెంట్‌కు పాజిటీవ్‌గా స్పందిస్తుంటే.. కొందరు మాత్రం వర్మను తిట్టిపోస్తున్నారు. అసలు ఇండియానా జోన్స్‌కి ఇండియాకి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు.