సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిత్యం ఎదో ఒక వివాదలు సృష్టించకపోతే నిద్రపోని వర్మ గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చి వోడ్కా ఛాలెంజ్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ ఛాలెంజ్ ఇస్తున్న అంటూ హడావిడి చేశాడు వర్మ. తాజాగా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోడీ మధ్య స్నేహాన్ని ఉద్ధేశిస్తూ వర్మ ట్వీట్ చేశారు. రజినీకాంత్ దళపతి సినిమాలోని పాటను ఎడిట్ చేసి మోడీ ట్రంప్ వీడియోను క్రియేట్ చేసారు కొందరు. ఆ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన వర్మ ‘దీన్ని ఎడిట్ చేసిన ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది’. అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు వర్మపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ట్రంప్ భారత్ పర్యటనపై పలు సరదా ట్వీట్‌లు చేసి వర్మ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
I want to marry this editor 😍 pic.twitter.com/1qOiZ9KXbv
— Ram Gopal Varma (@RGVzoomin) April 22, 2020