HomeTelugu Trendingచెన్నకేశవులు భార్య, ఆడబిడ్డకు సాయం చేయండి: వర్మ

చెన్నకేశవులు భార్య, ఆడబిడ్డకు సాయం చేయండి: వర్మ

6 6
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్థిక సహాయం అందించాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పిలుపునిచ్చారు. దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్‌కు గురైన నిందితుడు చెన్నకేశవులు భార్య నిన్న రాత్రి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో, ఆమెకు సాయం చేయాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. ‘చెన్నకేశవులు భార్య రేణుక బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. భవిష్యత్తులో రేపిస్టుల నీడ వారిపై పడకుండా ఉండాలంటే… దయచేసి వారికి ఎవరికి తోచిన సాయం వారు చేయండి’ అని ట్వీట్ చేశారు. యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్ఎసీ కోడ్ ను షేర్ చేశారు. గతంలో చెన్నకేశవులు భార్యను వర్మ కలిసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమెకు ఆర్థికసాయం కూడా చేశారు. ప్రస్తుతం
ఆయన దిశ ఘటనపై సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!