వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా అనే సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీజర్ కూడా విడుదల చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రళయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని ఆధారంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని ఒక సాంగ్ ని రిలీజ్ చేశాడు. ‘దేవుడా నీకో దండం రా’ అంటూ సాగే ఈ పాటను వదిలాడు వర్మ. ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమాలోని ఈ సాంగ్ ఆద్యంతం దేవుణ్ణి ప్రశ్నిస్తూ తిడుతున్నట్లుగా సాగింది. ఈ పాటకు సిరాశ్రీ లిరిక్స్ అందించాడు. డీఎస్సార్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసి స్వయంగా పాడాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సీఎం క్రియేషన్స్ నిర్మించగా అగస్త్య మంజు దర్శకత్వం వహించాడు.