అమలాపాల్ నటించిన తాజా చిత్రం ‘ఆమె’ టీజర్ సన్సేషన్‌గా మారింది. దీనికి కారణం ఆమె ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించడమే. అయితే ఆమె నగ్నత్వంలో నిజాయితి నా హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. న్యూడ్‌గా నటించిన అమాలాపాల్‌పైన.. దర్శకుడు ఎమ్.ఆర్ రత్న పైన ప్రశంసల జల్లు కురిపించారు.
ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. అమలాపాల్ లీడ్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ఆమె పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళంలో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. తమిళ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా ఉంది.
తన కూతురు కనిపించడం లేదని ఒక తల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేయడం.. పోలీసులు ఎంక్వైరీలో చివరిగా ఆమె ఫోన్ మాట్లాడినప్పుడు తాగి ఉందని తెలుసుకోవడం.. పోలీసులు మిస్ అయిన అమ్మాయిని వెదకడం, చివరిగా ఒక ఆమె పనిచేస్తున్న ఆఫీస్‌లో నగ్నంగా రక్తపు మడుగులో ప్రాణాలతో పడి ఉండటంతో టీజర్ ఎండ్ చేశారు. అయితే ఆమెపై అలా ఉండటానికి కారణం ఏంటి? ఆమెపై అత్యాచారం జరిగిందా? ఎవరు చేశారు? ఎందుకు తాగి పడిఉంది? లాంటి ఆసక్తికర థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో బోల్డ్ అండ్ థ్రిల్లర్‌గా ఉంది ‘ఆమె’ టీజర్.
Check out this amazing trailer of Aame https://t.co/psavbSuy1f The naked honesty of @Amala_ams is heart touching💐💐💐and the integrity of director @MrRathna is explosive 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) June 18, 2019