వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్ర ‘నగ్నం’ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ స్వీటీ.. శ్రీ రాపాక సోషల్ మీడియాలో వరుస ఇంటర్వ్యూలతో హల్ చల్ చేస్తుంది. ఇండస్ట్రీలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా 40పైగా చిత్రాలకు పైగా పనిచేసిన శ్రీరాపాకను ‘నగ్నం’ చిత్రంతో ఇండస్ట్రీలో మెరుపులు మెరిపించేలా చేశాడు వర్మ. ఈ బ్యూటీ తాజాగా నందమూరి బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఇండస్ట్రీలో నాకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు. ఎందుకంటే.. నేను ఎవరిదగ్గరకూ ఆర్టిస్ట్‌గా వెళ్లలేదు.. ప్రొఫెషనల్ డిజైనర్‌గా వెళ్లా. టెక్నీషియన్‌తో మాట్లాడటానికి భయపడతారు. గౌరవం ఇస్తారు. ఆర్టిస్ట్ అంటే అది అంటారు.. టెక్నీషియన్ అంటే మేడమ్ అంటారు. నా వరకూ నన్ను ఇండస్ట్రీలో పులి అంటారు. శ్రీ మేడమ్ వచ్చేసింది. పులి బాబోయ్ అంటారు. అంతెందుకు నేను బాలకృష్ణ గారితో పని చేశా.. ఆయన మహిళా ఆర్టిస్ట్‌లను అదీ.. ఇదీ.. డామ్.. డిస్క్ అంటారు. నాకు మీటింగ్ ఎప్పుడూ ఆయన ఇంట్లోనే జరిగేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్లాల్సి వచ్చేది. బాలయ్యకు కోపం ఎక్కువ అనే మాట నిజమే. షార్ట్ టెంపర్ ఉంది. ఆయనతో నేను ఆయన ఇంట్లోనే ఈ సినిమా కోసం 15-20 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆయన నన్ను చూసి నార్త్ అమ్మాయిని అనుకున్నారు. తెలుగు అని అనుకోలేదు. కాని నేను చాలా ట్రెడిషనల్‌గా చుడీదార్ వేసుకునే వెళ్లా. మరి ఆయనకు అలా ఎందుకు కనిపించానో తెలియదు కాని.. ఎక్కడ నుంచి వచ్చావ్ అన్నారు.. వెస్ట్ గోదావరి సార్!! అని అనగానే.. తెలుగు అమ్మాయివా అన్నారు.
నేను ఎంత పులి అయినా.. ఆయన నాకంటే పెద్ద పులిలా ఉంటారు. ఆయనో లయన్. అందుకే కాస్త భయం భయంగానే ఆయన దగ్గర ఉన్నాను. భయం అని అనలేం కాని గౌరవం. ఆయనతో డిస్కషన్ ముగిసిన తరువాత.. సార్.. ఓ రిక్వెస్ట్ అన్నాను.. ఏంటో చెప్పు అన్నారు బాలకృష్ణ గారు. ‘మీరు డిజైనర్స్‌ని కొడతారంట కదా.. నిజామేనా అని అడిగాను. మీరు జూన్ 10న పుట్టారు.. నేను 13న పుట్టాను సేమ్ మెంటాలిటీ అని చెప్పా. ఎందుకంటే ఆయన కొడితే తిరిగి కొట్టేస్తా అని ఇన్ డైరెక్ట్‌గా చెప్పా. ఆయనది నిజంగానే చిన్న పిల్లల మెంటాలిటీ.. చాలా సరదాగా ఉంటారు. అప్పుడే కోపం వస్తుంది.. అప్పుడే నవ్వేస్తారు.. ఆయనలాగే నాకు ఆత్మభిమానం (సెల్ఫ్ రెస్పెక్ట్) ఎక్కువ’ అంటూ తనను బాలకృష్ణ తో పోల్చుకుంటూ తన గురించి తాను చాలా ఎక్కువగానే చెప్పేసుకుంది ఆర్జీవీ బ్యూటీ.