సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గతంలో జీఎస్టీ తో చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. శృంగార తార మియామాల్కోవా తో తెరకెక్కించిన జీఎస్టీ రసిక రాజాలను బాగానే ఆకట్టుకుంది. ఇక మరోసారి మియామాల్కోవా ప్రధాన పాత్రలో వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు క్లైమాక్స్ అనే టైటిల్ ను పెట్టారు. కొద్దీ సేపటి క్రితమే ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ లో మరోసారి తన అందాలతో ఆకట్టుకుంది మియా. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మే 18వ తేదీన విడుదల చేయనున్నారు.