రామ్ గోపాల్ వర్మ.. ఒక సినిమాను తీయడమే కాదు దాన్ని ఏరకంగా ప్రమోట్ చేసుకోవాలో కూడా ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వర తెలియదేమే. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పూటకో టెక్నిక్ ఉపయోగిస్తున్నాడు. ఈసినిమాను ఈ నెల 22న విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు టీడీపీ ఈ సినిమా విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం వాళ్లు రాష్ట్ర ఎన్నికల అధికారికి బదిలీ చేయడం. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. విడుదల తర్వాత ఏదైనా పార్టీకి ఈ సినిమా వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సెన్సార్‌కు రెడీ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఈసినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ ఫోటోను మార్పింగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. అంతేకాదు అందులో ఉన్నది ఎవరు అంటూ క్వశ్చన్ చేసాడు.
అచ్చం ఎన్టీఆర్ మొఖానికి రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు హైప్ తీసుకురావడానికి ఎన్ని పాట్లు పడాలో అన్ని పాట్లు పడుతున్నాడు. మరి వర్మ పడుతున్న ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా లేదా అనేది చూడాలి.