HomeTelugu Trendingరామ్ గోపాల్ వ‌ర్మ‌ పేరుతో హోటల్‌.. ఆర్జీవీ స్పందన

రామ్ గోపాల్ వ‌ర్మ‌ పేరుతో హోటల్‌.. ఆర్జీవీ స్పందన

ram gopal varma fan started
సంచలన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఓ కుటుంబంలోని సభ్యులు అందరూ అభిమానులే. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో ఆయ‌న పేరిట హోట‌ల్ పెట్టేసి, దాని నిండా ఆర్జీవీ సూక్తుల పోస్ట‌ర్ల‌ను కూడా ముద్రించి క‌స్ట‌మ‌ర్ల‌తో చ‌దివిస్తున్నారు. ఆర్జీవీ చెప్పిన మాట‌లు దైవ వాక్కుల్లా ఉన్నాయని చెబుతున్నారు. ఆ హోట‌ల్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆర్జీవీ స్వ‌యంగా పోస్ట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

కాగా తన పేరు మీద హోటల్‌ ఏర్పాటు చేయడంపై ఆర్జీవీ సైతం స్పందించాడు. నా పేరుతో హోటల్‌ ఉందంటే చచ్చిపోయినట్లు అనిపిస్తుంది అని తనదైన స్టైల్‌లో ట్వీట్‌ చేశాడు. ఇక ఆర్జీవీ పేరుతో ఉన్న హోటల్‌ స్థానికంగా తెగ పాపులర్‌ అవుతుంది. అక్కడి వంటకాలను రుచి చూడాలనుకుంటే మాత్రం మీరు తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక గ్రామానికి వెళ్లాల్సిందే. ఆర్జీవీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!