వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నోటికి వచ్చింది మాట్లాడతాడు.. నచ్చింది చేస్తాడు. ఇతరులు ఇబ్బంది పడినా.. ఆయన మాత్రం నాకు ఇదే కరెక్ట్ అంటాడు. A సర్టిఫికెట్ సినిమాలు తీయడం, డబుల్ మీనింగ్ డైలాగులు వదలడంలో వర్మతో ఎవరూ పోటీ పడలేరు. వర్మ ఇటీవలే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. యూనివర్శిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన ధోరణిలో జవాబులిచ్చాడు.
టీచర్లు, తల్లిదండ్రులు పెట్టే ఆంక్షలను పట్టించుకోకుండా తమకు నచ్చిన విధంగా ఉండాలని విద్యార్థులకు వర్మ హితబోధ చేశారు. ఏ పనైనా చేయకూడదన్న రూల్ లేదని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు బతకాలని వర్మ సూచించారు. నచ్చింది తినాలని, ఫుల్లుగా తాగండి ఎంజాయ్ చేయండి. ఇష్టం వచ్చినప్పుడు సెక్స్ చేయాలని వర్మ చెప్పుకొచ్చారు. పైగా ముందు బెంచ్ విద్యార్థులు పైకి రారని, తనలాంటి బ్యాక్ బెంచ్ వాళ్లే జీవితంలో పైకి వస్తారని వర్మ చెప్పుకున్నారు. హార్డ్ వర్క్ చేసి ప్రయోజనం లేదని, అందరూ స్మార్ట్ వర్క్ చేయాలని వర్మ విశ్లేషించారు.
ఆత్మహత్యలు, చావులపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించారు. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ ఊర్వశిలు ఉండకపోవచ్చు.. కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయండి అన్నాడు. వైరస్ వచ్చి మగజాతి అంతా చచ్చిపోవాలి. నేను మాత్రమే బతికి ఉండాలి. అప్పుడు. స్త్రీ జాతికి నేనే దిక్కవ్వాలి“
వర్సిటీ వీసీ కూడా వర్మకు వత్తాసు పలికారు. వర్మ ఒక ప్రొఫెసర్ ఫిలాసఫర్ కంటే ఎక్కువ. వర్మకు పీహెచ్డీ ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయి.. అని వ్యాఖ్యానించారు. అసలు ఆర్జీవీలాంటి ఒక మూర్ఖుడుని గెస్ట్‌గా పిలిచిన నాగార్జున యూనివర్శిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు చెప్పాల్సిన విషయాలు ఇవేనా? అని పలువురు మండిపడుతున్నారు. యూనివర్శిటీ విద్యార్థులు, మహిళా ఉద్యోగులు సైతం వర్మను విమర్శిస్తున్నారు.
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు