పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు తరలివచ్చారు. మంత్రి కేటీఆర్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్ ప్రసంగం ఎంతో హుందాగా, అద్భుతంగా, మనసును హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉందని ఆయన కితాబిచ్చారు. ఆయన ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉందని చెప్పారు.
This is one of the best speeches of @PawanKalyan ever ..So heart felt , emotional and humble https://t.co/x5iGiSnowC via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2022