టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజా’ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నటి కీర్తి సురేష్. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ.. నాని ‘నేను లోకల్’ సినిమాలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ లో నటించింది. అయితే మహానటి సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం లభించింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘పెంగ్విన్’ సినిమాలో నటిస్తోంది.
అది అలా ఉంటే..కీర్తి ఇటీవలే తన 27వ పుట్టినరోజున జరుపుకుంది. ఈ సందర్భంగా కీర్తి నటిస్తోన్న ఓ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నగేష్ దర్శత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన కీర్తి లుక్‌పై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా రాస్తూ.. కీర్తి లుక్‌కు ఫిదా అయ్యానని.. ఆ లుక్‌లో కీర్తి అదిరిపోయిందని.. విభిన్న కథలతో కీర్తి అదరగొడుతోందని తెలుపుతూ చిత్ర బృందానికి తన విషేష్‌ను తెలియజేశారు.
Am amazingly impressed with this look of the Maha Nati proving her amazing versetality and my congratulations to the producers namely my niece @ShravyaVarma and my very long time very loving associate @sudheerbza pic.twitter.com/83mtk50iyI
— Ram Gopal Varma (@RGVzoomin) October 18, 2019